Wednesday, November 20, 2024
Telugu Midnight Stories

కాలం కలిసొస్తే 5

telugu sex stories కాలం కలిసొస్తే 5 నేహా వీడియో కాల్ చేస్తుందని నేను అనుకోలేదు. ఉదయం మాట్లాడినప్పుడు కాల్ అన్నాను కానీ వీడియో కాల్ కి నేను ప్రిపేర్ అవ్వలేదు. నేను ఇంట్లో ఒక్కడినే ఉండటం వలన స్నానం చేసాను బట్టలు వేసుకోలేదు. టవల్ తో వొళ్ళు తుడుచుకుని ఆలా బెడ్ మీద పడుకున్నాను. వెంటనే తనకి మెసేజ్ పెట్టాను. ఒక టు మినిట్స్ లో నేనే చేస్తాను అని.

వెయిటింగ్ ఇక్కడ, అని స్మైలీస్ తో కూడిన మెసేజ్ వచ్చింది.

నేను ఒక షార్ట్ ఇంకా టీ-షర్ట్ వేసుకుని తనకి మెసేజ్ పెట్టాను. రెడీ అని.

నేహా మళ్ళీ కాల్ చేసింది. నేను కాల్ ఎత్తానుగాని తన సైడ్ లైట్ చాలా డల్ గా ఉండటం వాళ్ళ సరిగ్గా కనిపించలేదు.

‘ఏమి చేస్తున్నావు?’ అన్నాను.

‘ఏమి లేదు. కిచెన్ లో ఉన్నాను. ఆకలేస్తే ఆపిల్ కట్ చేసుకుంటున్నాను,’ అంది.

‘నాకు సరిగ్గా కనిపించట్లేదు,’ అన్నాను.

‘ఒక నిమిషం ఉండరా. నా బెడ్ రూమ్ లోకి వెళ్తాను,’ అంది.

నా బెడ్ రూమ్ అనేప్పటికీ నాకు డౌట్ వచ్చింది. ‘ఎక్కడున్నావు?’ అని అడిగాను.

‘అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను,’ అంది.

ఎందుకో తెలీదు. ఆ మాట వినగానే మనసుకి కొంచం బెటర్ అనిపించింది. ఎవ్వరు ఉండరు, డిస్టర్బ్ చెయ్యరు అనే నమ్మకం.

టంగు టింగు అని ఏవో గిన్నెలు శబ్దం అయింది. ‘నాకు చెవులు పోతున్నాయి,’ అన్నాను. ఫోన్ లో గిన్నెలు శబ్దం చాలా ఎక్కువగా వినిపించింది.

‘వెయిట్ బాబా. వచేస్తున్నాను రూంలోకి,’ అంది. అంటూనే తాను రూంలోకి రావడం, లైట్ వేయడం, వెంటనే తలుపు లాక్ చెయ్యడం అన్ని నాకు వినపడుతున్నాయి, మసకగా కనపడుతున్నాయి.

ఒక నిట్టూర్పు వదిలి వెయిట్ చేశాను.

ఒక నిమిషం అలానే తిరుగుతున్న ఫ్యాన్ కనిపిస్తోంది. వార్డ్రోబ్ ఓపెన్ చేసిన శబ్దం వినిపించింది. ‘ఉన్నావా?’ అని నేహా గొంతు విన్పించింది దూరం నుంచి.

‘హా,’ అన్నాను. నా మనసులో ఎన్నో ఆలోచనలు నడుస్తున్నాయి. నేహాతో మాట్లాడటం అది ఇన్నాళ్ల తరువాత. తనని చూడబోతున్నాను అనే ఒక ఉత్సుకత. తాను ఎలా ఉందొ అని, ఏమి మార్పులు చూడాల్సొస్తుందో అని, ఒక చిన్న భయం. ఇలా ఆలోచనల ప్రవాహ నడుస్తోంది. బలంగా ఊపిరి పీల్చి ప్రాణాయామ చేశాను గుండె వేగం తగ్గడానికి.

‘వచ్చేసా’ అన్న నేహా మాటకి ఉలిక్కిపడి ఫోన్ వంక చూసాను. ‘సారీ వెయిట్ చేయించాను,’ అంది నవ్వుతూ.

ఇందాకటి నుంచి నా మనసులో వచ్చిన ఆలోచనలు అన్ని పటాపంచలు అయ్యాయి. నేహాని అలా చూడగానే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఒక నిమిషం పాటు తానూ పెళ్లి అయినా ఒక అమ్మాయి అని మర్చిపోయాను. నా నేహా మళ్ళీ నాతో మాట్లాడుతోంది. ఇది వరకు లాగ ఫోన్ లో వీడియో కాల్.

‘ఎలా ఉన్నావు నేహా,’ అని అడిగాను.

నేను అనుకోకుండా నా గొంతులో మునుపటి ఆప్యాయత వచ్చేసింది. అంతే, నేను చూస్తుండగానే నేహా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలా బొటబొటా కారిపోయాయి.

నేహా భావోద్వేగాలు అంత తేలికగా చూపించే అమ్మాయి కాదు. అలాంటిది తనని అలా చూసేసరికి నాకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కానీ కంట్రోల్ చేసుకున్నాను. తను నాకు సమాధానాలు చెప్పాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. అంత వరకు నేను ఓపెన్ అప్ అవ్వకూడదు అనుకున్నాను. కానీ అవి అడగడానికి ఇది సమయం కాదు అని తనకి రికవర్ అవ్వడానికి టైం ఇచ్చాను.

‘అమ్మా వాళ్ళ ఇంటికి ఎప్పుడొచ్చావు?’ అని అడిగాను.

‘పొద్దున్న,’ అని అంది.

‘అందరు ఎలా ఉన్నారు?’ అన్నాను.

‘బానే ఉన్నారు,’ అంది కళ్ళు తుడుచుకుంటూ.

పక్కనే ఉంటె బహుశా గట్టిగా వాటేసుకునేవాడినేమో.

‘నీళ్లు తాగు,’ అన్నాను తన ఏడుపు తగ్గడానికి.

చెప్పినమాట వినే చిన్న పిల్లలాగా నీళ్లు తాగింది.

‘ఇప్పుడు చెప్పు,’ అన్నాను.

ఒక అరగంట పాటు చాలా జనరల్ టాపిక్స్ మాట్లాడుకున్నాము. సినిమాలు, వాళ్ళ అమ్మ నాన్న కొత్త ఇల్లు కొన్నారు, దాని గురించి, మా అమ్మ నాన్న గురించి అలా పలు విషయాలు మాట్లాడాము. మెల్లిగా టాపిక్ నా ఆఫీస్ మీదకి వచ్చింది.

‘నీ ఆఫీస్ డిన్నర్ ఎలా జరిగింది?’ అని అడిగింది.

‘బాగా జరిగింది,’ అన్నాను.

ఈ రెండు నెలల చాటింగ్ లో నేను అటొచ్చి ఇటొచ్చి ఆఫీస్ విషయాలు చెప్పేవాడిని. కొలీగ్స్ పేర్లు, ఎవరు ఏమి చేస్తారు, నా పని ఎలా ఉంది అన్ని. నేహా కూడా ఒక పెద్ద కంపెనీ లో పని చేసేది. పెళ్లి తరవాత జాబ్ మానేసింది అని మాత్రమే నాకు తెలుసు. ఇంక అంతకంటే తన విషయాలు నాకు ఏమి చెప్పలేదు, నేనూ అడగగలేదు.

‘ఎక్కడికి వెళ్లారు?’ అని అడిగింది.

నాకు అప్పుడే తట్టింది. ఆ రోజు పొద్దున్న మాట్లాడేటప్పుడు నేను లేట్ అవుతుంది అని చెప్పాను కానీ డిన్నర్ కి వెళ్తున్నాను అని చెప్పలేదు. దీనికి ఎలా తెలిసింది? ఇంతే కాదు నా గురించి చాలా విషయాలు తెలిసాయి. ఈరోజు ఎలాగైనా తెలుసుకోవాలి అని అనుకున్నాను.

‘అది కూడా నువ్వే చెప్పు. తెలిసే ఉంటుంది కదా నీకు,’ అన్నాను.

నేను కనిబెట్టేసాను అను అర్థం అయ్యి నాలిక కరుచుకుంది. ‘నాకెలా తెలుస్తుంది రా?’ అంది కవర్ చేసుకుంటూ.

‘చంపుతా అబద్దాలు చెప్పావంటే. నేను నీ ఫోన్ ఎత్తలేదు. మెసేజెస్ కి రిప్లై ఇవ్వలేదు. ఫేస్బుక్ లో అప్డేట్ చెయ్యలేదు. నీకు ఎవరన్నా చెప్తే తప్ప తెలిసే అవకాశం లేదు. మర్యాదగా నీకు నా విషయాలు ఎలా తెలుస్తున్నాయో చెప్పు,’ అని అదిమాయించాను.

ముందు నవ్వింది, తరువాత దొరికిపోయాను అన్నట్టు నవ్వింది. కానీ అంత ఈజీ గా చెప్తే నేహా ఎందుకు అవుతుంది. ‘కనుక్కో చూద్దాము?’ అంది.

ఎంత ఆలోచించినా నాకు ఒక్కటే తట్టింది. మా ఆఫీస్ లో తనకి ఎవరో తెలుసు. నేను టీం డిన్నర్ కూడా చేశాను అని తెలిసింది అంటే అది మా టీం లోనే ఎవరన్నా అయ్యి ఉండాలి.

‘నా టీం లో ఎవరు నీకు ఫ్రెండ్?’ అని అడిగాను.

నేహా నోరు తెరిచి ఆశ్చర్యపోయింది. ‘ఫస్ట్ గెస్ లో ఎలా రా కనుక్కున్నావు?’ అంది.

‘లాజికల్ రీసనింగ్ అంటారు దాన్నే. తెలుసు కదా మనము అందులో కింగ్ అని,’ అన్నాను గర్వంగా.

‘ఇంప్రెస్సివె,’ అంది చప్పట్లు కొడుతూ. ‘మరి ఆ మనిషి ఎవరో కూడా నువ్వే కనుక్కో?’ అంది.

‘స్వప్న,’ అన్నాను.

‘నో,’ అంది.

‘రియా,’ అన్నాను.

‘నో నో. లాస్ట్ ఛాన్స్,’ అంది.

‘అవును లే. రియా ని నేనే కలవలేదు. ఆమె అయ్యి ఉండదు.

‘ప్రవీణ నా?’ అన్నాను.

నేహా నవ్వింది. ‘దద్ది మొహం వెధవ,’ అంది.

‘ఏమైంది?’ అన్నాను అర్థం కాక.

‘ప్రవీణ అని గెస్ చెయ్యడానికి ఇంత టైం పట్టింది. నువ్వేమి లాజికల్ రీసనింగ్ కింగ్ వి?’ అంది.

నేను ఒక్కసారి షాక్ అయ్యాను. ‘అసలు ప్రవీణ నీకు ఎలా తెలుసు?’ అని అడిగాను.

ముందు పకపకా నవ్వింది. ఆ తరువాత, ‘నువ్వు ఈరోజు స్వప్నని కాకుండా ప్రవీణని ఇంట్లో దింపి ఉంటే, మా పక్కన ఇంటికి వచ్చేవాడివి,’ అంది.

‘వాట్? నిజంగా నా? ప్రవీణ మీ ఇంటి పక్కన ఉంటుందా?’ అని అడిగాను నమ్మకం కుదరక.

‘అవును. నీకు ఎప్పుడూ నాకో చిన్నప్పటి ఫ్రెండ్ మా ఇంటిపక్కనే ఉంటుంది అని చెప్పేదాన్ని గుర్తుందా?’ అని అడిగింది.

నేహా నేను రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు తన ఫామిలీ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ అందరిని నేను కలిసాను. అలాగే తాను కూడా నా ఫామిలీ ఇంక నాఫ్రెండ్స్ ని కలిసింది. కానీ ప్రవీణ పేరు నేను ఎప్పుడూ వినలేదు. బాగా ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది. నేను కలవని ఫ్రెండ్ ఒకేఒక్కరు. డాలీ అనే ఒక అమ్మాయి. తాను నేహా ఇంటి పక్కనే ఉండేది అని తెలుసు. కాకపోతే వేరే ఊర్లో ఉండి హాస్టల్ లో ఉండి చదువుకునేది. కాబట్టి నేను ఎప్పుడు నేహా ఇంటికి వెళ్లిన కలిసే అవకాశం దొరకలేదు.

‘డాలీ?’ అన్నాను.

‘యెస్. డాలీ అని మేమందరము చిన్నప్పటి నుండి ముద్దుగా పిలుస్తాము. ఆ డాలీ అసలు పేరు ప్రవీణ,’ అంది పెద్ద సస్పెన్స్ కి తెర దించుతూ.

‘అమ్మ ప్రవీణ!!! నా పక్కనే ఉంటూ, ఇన్ని రోజులైనా ఏమి నటించింది. ఆస్కార్ ఇవ్వాలి దానికి,’ అన్నాను.

నేహా నవ్వింది. ‘అవును. పాపం అది ఎన్నో సార్లు నన్ను అడిగింది. పాపం లోకేష్. నేను నీ ఫ్రెండ్ అని చెప్పేస్తాను అని అనేది. నేనే దాన్ని ఆపాను,’ అంది.

‘ఎందుకు అన్నాను?’ కుతూహలంతో.

నేహా మాట్లాడేముందు నిట్టూర్పు వదిలింది. ‘జరిగింది అంతా దానికి తెలుసు. ఇలా ఇంట్లో మన విషయం గురించి గొడవలు జరుగుతున్నప్పుడు నేను ఎవ్వరితో చెప్పుకోవాలో అర్థం కాలేదు. నీకు చెప్పాలంటే నువ్వు ఇంకా టెన్షన్ పడతావు. ఎవరితోనూ షేర్ చేసుకోకపోతే తలపగిలి చచ్చిపోతానేమో అనిపించింది. ఆ టైంలో నాకు తోడుండి అదే. దానికి ప్రతీ విషయం తెలుసు. నాకు అదే ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేది. నేను నిన్ను హర్ట్ చేస్తున్నాను అని తెలిసి కూడా చేసినందుకు నువ్వు నన్ను దూరం పెట్టావు. కానీ ఆ క్రమంలో నేను కూడా నరకం చూసాను. నీకు ఫోన్ చేసినప్పుడు నువ్వు ఎత్తకపోతే నేను వెంటనే దానికి ఫోన్ చేసి ఏడ్చేదాన్ని,’ అని ఒక చిన్న గ్యాప్ ఇచ్చింది. పక్కనే ఉన్న నీళ్ల బాటిల్ నుంచి నీళ్లు తాగింది.

నేను కూడా నీళ్లు తాగి వెయిట్ చేశాను నేహా మాట్లాడేందుకు.

‘నాకు పెళ్లి చేసి పంపేశారు. వేరే ఇంటికి వెళ్ళాను. కానీ నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఏమయిపోయావో తెలియక ఎంతో బెంగ పెట్టుకున్నాను. చివరికి ఒకరోజు మీ అమ్మకి ఫోన్ చేశాను. ఆంటీ ఫోన్ లో ఏడ్చారు. నీకు జాబ్ పోయింది అని ఆవిడే చెప్పారు,’ అంది.

నేను షాక్ అయ్యాను. మా అమ్మ నేహా మాట్లాడుకున్నారా? మా అమ్మ నేహా మెసేజెస్ పెట్టుకునే వారు మాట్లాడుకునే వారు అని తెలుసు కానీ నా బ్రేకప్ అయ్యాక కూడా మాట్లాడుకున్నారు అని నాకు తెలియదు. అప్పుడు నాకు సడన్ గా గుర్తొచ్చింది. ఒకరోజు మా అమ్మ ఏడుస్తుంటే నేను చూసాను. అదే రోజు జాబ్ సెర్చ్ చెయ్యాలి అని నిర్ణయించుకున్నాను.

నేహా మళ్ళీ మాట్లాడింది. ‘గుర్తొచ్చిందా? ఆ రోజు ఆంటీ ఏడుస్తుంటే నువ్వు చూసావు. నిన్ను చూసి ఆంటీ ఫోన్ పెట్టేసారు తరవాత చేస్తాను అని. ఆ సంఘటన తరువాతే నువ్వు జాబ్ సెర్చ్ మొదలెట్టావు,’ అంది.

‘హ్మ్మ్’ అని తల ఆడించాను.

‘నువ్వు జాబ్ సెర్చ్ మొదలెట్టినప్పుడు అనుకోకుండా డాలీ పనిచేసే కంపెనీలో, అదే ప్రవీణ వాళ్ళ కంపెనీలో నీకు సూట్ అయ్యే ఓపెనింగ్స్ ఉన్నాయి అని తెలిసింది. అది వెంటనే HR థెరెసా కి చెప్పింది. తాను నీ ప్రొఫైల్ నౌకరీ వెబ్సైటు లో చూసి షార్ట్ లిస్ట్ చేసింది. ఇంక ఆ తరువాత నీ టాలెంట్ నీకు జాబ్ ఇప్పించింది,’ అని అంది.

నాకు దిమ్మ తిరిగిపోయింది. నేను నేహా మీద ఎంతో కోపం పెంచుకున్నాను నన్ను వదిలేసింది అని. కానీ తన వైపు నుంచి ఆలోచిస్తే తాను ఎంత చిత్రహింస అనుభవించిందో అర్థం అయింది. తాను తప్పు చేసిందా లేదా అనేది కాదు. పరిస్థితులు అలా ఉన్నాయి అప్పుడు.

‘మరి నాకెందుకు చెప్పలేదు?’ అన్నాను.

‘ఏ విషయం?’ అంది.

‘ప్రవీణ నీ ఫ్రెండ్ అని,’ అన్నాను.

‘నువ్వు కోపంతో నాతో మాట్లాడట్లేదు. ప్రవీణ నా ఫ్రెండ్ అని తెలుస్తే, నువ్వు తనని కూడా దూరం పెడతావేమో అని. అలా జరిగితే నీ గురించి నాకు ఏ విషయాలు తెలియవు. నీ బాగోగులు తెలియకపోతే.. నాకు చాలా కష్టం,’ అంది వణుకుతున్న గొంతుతో.

నేను ఒక రెండు నిముషాలు మౌనంగా ఉన్నాను.

‘ఏమనాలో అర్ధం కావట్లేదు,’ అన్నాను.

‘నువ్వేమి అనక్కర్లేదు. నువ్వు మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు. నాకు అది చాలు,’ అంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top